దీపాయిగూడలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము చేస్తున్న గ్రామస్తులు
చిత్రం న్యూస్, జైనథ్: మొదటి శ్రావణ శుక్రవారంను పురస్కరించుకుని జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో 108 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు లోక సౌజన్య కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. ప్రతీ గ్రామంలో కూడా సామూహిక సత్సంగాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం పారాయణం నిర్వహించుకునేల ప్రణాళిక వేసుకుంటే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయుడు నాగభూషణం పాల్గొన్నారు.
