వజ్జర్ అంగన్వాడీ కేంద్రం గోస
వజ్జర్ అంగన్వాడీ కేంద్రంలోని పరిస్థితి చిత్రం న్యూస్, సొనాల : ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని ఆదివాసీ మారుమూల గ్రామం వజ్జర్ మహదుగూడ అంగన్వాడీ కేంద్రం పరిస్థితి గోస గా ఉంది. ఇందులో 15 మంది పిల్లలు, ఇద్దరు బాలింతలు, నలుగురు గర్భిణులు ఉన్నారు. ఈ కేంద్రం ప్రభుత్వ పాత బిల్డింగ్ లో కొనసాగుతుంది. వర్షం వస్తే అంతే సంగతి. నీరు కారడంతో అక్కడ ఉండలేని పరిస్థితి. కూర్చుందామంటే కింద నీళ్లు ఉంటాయి. భవనం శిధిలావస్థకు చేరడంతో...