సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న దృశ్యం
చిత్రం న్యూస్, పెద్దాపురం: ఎన్నికల సమయంలో కూటమి నేతలు లారీ డ్రైవర్స్, ఓనర్స్ కు గ్రీన్ టాక్స్ తగ్గిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుని, తక్షణమే దానిని అమలు చేసిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పెద్దాపురం మండలం లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్షీరాభీషేకం నిర్వహించారు. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద లారీ యూనియన్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దాపురం మండలం లారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరికి అప్పారావు, కార్యదర్శి కుంది కొండలరావు, కోశాధికారి యందమూరి రవి కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు మట్టే శ్రీనివాస్ రావు, అధ్యక్షులు, రాష్ట్ర సివిల్ సప్లయ్ స్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, బుజ్జి, దిద్ది సత్యనారాయణ, కొప్పిశెట్టి వీరేంద్ర, గెడ్డం పెదకాపు, తూతిక రాజు, వల్లూరి సూర్యప్రకాష్ రావుతో పాటు పెద్ద సంఖ్యలో లారీ ఓనర్స్, డ్రైవర్స్ పాల్గొన్నారు.