Chitram news
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 9:42 am Editor : Chitram news

బేలలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

బేలలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

*మాట్లాడుతున్న ఎమ్మార్పీస్ మండల అధ్యక్షులు కృష్ణ పెళ్లి అంకుష్ మాదిగ 

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కృష్ణ పెళ్లి అంకుష్ మాదిగ అన్నారు. కెమెరాలు ఏర్పాటుకై శుక్రవారం ఎంపీడీవో, పోలీస్ అధికారులను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి  శివాజీ విగ్రహాల దగ్గర, బస్టాండ్, మార్కెట్ తో పాటు ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు లేకపోవడం వలన అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా కొంతమంది దొంగతనాలకు పాల్పడడం జరుగుతుందని అన్నారు. వీటిని అరికట్టేందుకు పకడ్బందీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంకజ్ గణేష్, ఎం.అంకుష్ ఎం. గణేష్ ఆకాష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.