కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాలింతలకు కేసీఆర్ కిట్ పంపిణీ చేస్తున్న తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు తుల శ్రీనివాస్
చిత్రం న్యూస్, సొనాల: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా పరిసర ప్రాంతాల మహిళలకు తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని ఐటీ విభాగంలో ఎంతో సేవలందించి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించిన మహానేత అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి బాలింత మహిళలకు కేసీఆర్ కిట్ల పంపిణీ అందించేవారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద మధ్యతరగతి మహిళలకు కేసీఆర్ కిట్టును పంపిణీ చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కేసీఆర్ కిట్ల పంపిణీ నిరంతరం ఉంటుందని, మహిళలు ఎవరైనా డెలివరీ ఆయిన తర్వాత తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ కి సమాచారం అందిస్తే కేసీఆర్ కిట్టును అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ వైస్ చైర్మన్ ఇర్ల అభిలాష్, యువ నాయకులు సుధీర్ రెడ్డి, చిన్నయ్య , హరీష్ , సోషల్ మీడియా కన్వీనర్ భీంరావు పాటిల్ , సోనాల మరియు బోథ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సోమన్న, అల్లకొండ ప్రశాంత్ , మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మండల సర్పంచులు సురేందర్ యాదవ్, దేవేందర్, బాబు సింగ్, మాజీ ఎంపీటీసీ లంక లలిత రాయల్, నాయకులు ఈశ్వర్, సంతోష్, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

