భోరజ్: కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేకు కట్ చేస్తున్న బీఆర్ఎస్ తాజా మాజీ వైస్ ఎంపీపీ విజయకుమార్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల ఊశన్న
చిత్రం న్యూస్, భోరజ్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను భోరజ్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తాజా మాజీ వైస్ ఎంపీపీ సావాపురే విజయకుమార్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల ఊశన్న కేకు కట్ చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముక్కెర ప్రభాకర్, మాజీ ఎంపీటీసీలు కోల భోజన్న, కట్కర్ల మహేందర్, మాజీ సర్పంచ్ నోముల సంతోష్ రెడ్డి, నాయకులు పురుషోత్తం యాదవ్, బట్టు సతీష్, రమేష్, గుంజాల అశోక్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

