Chitram news
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 8:12 am Editor : Chitram news

ఎన్నికలెప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలి

 నిరాలలో మాట్లాడుతున్న  ఎమ్మెల్యే శంకర్ తనయుడు పాయల్ శరత్

చిత్రం న్యూస్, జైనథ్: ఎన్నికలెప్పుడొచ్చిన  పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, యువ నాయకుడు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ అన్నారు. జైనథ్ మండలంలోని నిరాలలో ఓ ఫంక్షన్ హాల్ లో మండల స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో  పోటీచేసే అభ్యర్థులను గెలిపించే బాధ్యత మన అందరిపై ఉందని ,నిత్యం ప్రజలతో మమేకమై వాళ్ళకి ఏ కష్టం వచ్చిన  కార్యకర్తలు ముందుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి ప్రజలకి తెలయజేయాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండ్రాల నగేష్, పార్లమెంట్ కన్వీనర్ మయూర్ చంద్ర, బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, జడ్పీటీసీల ఇంచార్జ్ దత్త థాక్రె, ఎంపీటీసీల ఇంచార్జ్ కుర్సంగి సీతారామ్, మాజీ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్, జైనథ్, భోరజ్ మండలాల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, సన్నీ, బీజేపి సీనియర్ నాయకులు టి.రాకేష్ రెడ్డి, సామ రమేష్ రెడ్డి, ప్రతాప్ యాదవ్, ఏనుగు రాకేష్ రెడ్డి, గొడుగుల సత్యనారాయణ, వెంకన్న, సిడాం రాకేష్ , వెంకట్ రెడ్డి, సంతోష్, విశాల్, సూర్య రెడ్డి, శక్తి కమిటీ, బూత్ కమిటీల అధ్యక్షులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.