ఖండాల జలపాతంలో పడి విద్యార్థి గల్లంతు
మనోహర్ సింగ్ (ఫైల్ ఫొటో) చిత్రం న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల జలపాతంలో పడి ఓ విద్యార్థి గల్లంతైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన మనోహర్ సింగ్ (17) తన స్నేహితులతో కలిసి ఖండాల జలపాతం వద్దకు వెళ్ళారు. ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మనోహర్ సింగ్ గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు భయపడి ఇంటికి వచ్చేశారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు డీడీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.