చిత్రం న్యూస్, బేల: విపత్కర పరిస్థితిలో నుంచి బయటపడి బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బేల లో ఆపరేషన్ జ్వాలా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్సై మధు కృష్ణ తెలిపారు. బుధవారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ఒక్కో పాఠశాలలో 10 రోజుల చొప్పున రెండు నెలల పాటు ఈ శిక్షణ నిర్వహిస్తామన్నారు. కరాటే వల్ల బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి నవీన, సీఆర్టీలు, విద్యార్థులు పాల్గొన్నారు

