మెగా జాబ్ మేళా పోస్టర్లను విడుదల చేసున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఇచ్చోడ: టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో ఈ నెల 25 న నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి లు కోరారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో జాబ్ మేళాకు సంబందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ, ఇంటర్, పీజీ, BE, B.Tech, M.Tech, BA, B.Sc., B.Com, , MBA, MCA, MCS , హోటల్ మేనేజ్మెంట్, ITI తదితర కోర్సులను పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉట్నూర్ మండలం పెర్కగూడ లోని JCN ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

