ఆర్మీ జవాన్ ఆకాష్ కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ టీం సభ్యులు
చిత్రం న్యూస్, బోథ్: బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన యువకుడు ఆర్మీ జవాన్ ఆకాష్ మృతి చెందగా బుధవారం అంత్యక్రియలు వర్తమాన్నూర్ గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా అంతక్రియల్లో పాల్గొన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ మాట్లాడుతూ తక్షణం వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని తనవంతుగా రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆడే గజేందర్ ఆదేశాలమేరకు ఆడే గజేందర్ గారి (టీం) సభ్యులు ఆర్మీ జవాన్ ఆకాష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..ఆకాష్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా కూడా ఆదుకునే విధంగా చొరవ చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్, గస్కంటి రవి,(AGF)టీం ఎండి సద్దాం, మౌలానా, క్రాంతి, తీగల విలాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
