స్ఫూర్తిదాయకమైన సేవలే సమసమాజ నిర్మాణానికి సూచికలు
శర్వాణి స్కూల్‌లో పుస్తకాలు, పెన్నులను విద్యార్ధులకు పంపిణీ చేస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చిత్రం న్యూస్,ఏలూరు: స్ఫూర్తిదాయకమైన సేవలే సమసమాజ నిర్మాణానికి సూచికలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి తోడుగా దాతలు కూడా చేయూతనందించాల్సిన ఆవశ్యకత ప్రస్తుత తరుణంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో అవసరార్థులకు అందిస్తోన్న సేవాకార్యక్రమాలు వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇదేక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలల్లో...