Chitram news
Newspaper Banner
Date of Publish : 23 July 2025, 11:45 am Editor : Chitram news

స్ఫూర్తిదాయకమైన సేవలే సమసమాజ నిర్మాణానికి సూచికలు

శర్వాణి స్కూల్‌లో  పుస్తకాలు, పెన్నులను విద్యార్ధులకు పంపిణీ చేస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

చిత్రం న్యూస్,ఏలూరు: స్ఫూర్తిదాయకమైన సేవలే సమసమాజ నిర్మాణానికి సూచికలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి తోడుగా దాతలు కూడా చేయూతనందించాల్సిన ఆవశ్యకత ప్రస్తుత తరుణంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో అవసరార్థులకు అందిస్తోన్న సేవాకార్యక్రమాలు వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇదేక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తోన్న విద్యార్ధులకు దాతల సహకారంతో అనేక సేవలు అందుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం ఏలూరు ఆర్‌ఆర్‌ పేటలోని శ్రీ శర్వాణి స్కూల్‌లో నందమూరి ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన పుస్తకాలు, పెన్నులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్ధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన నందమూరి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఇదేసమయంలో కూటమి ప్రభుత్వ పాలనలో విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ సారథ్యంలో విద్యాశాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మాక మార్పులను వివరించిన ఆయన.. ఆ పథకాలన్నింటినీ విద్యార్ధులు సద్వినియోగం చేసుకొని విద్యలో ఉత్తమంగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్ధసారధి, నందమూరి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులు బిబిజి తిలక్‌, కర్ణ శ్రీనివాస్‌, శ్రీ శర్వాణి పాఠశాల డైరెక్టర్‌ కె. మదన్‌ మోహన్‌ రాజు, ప్రిన్సిపల్‌ సత్యశారద చల్ల సత్యనారాయణ (పెదబాబు ), సంకబాత్తుల నాగరాజు, 40 వ డివిజన్ ఇంచార్జి బోర ప్రసాద్, బొంతు చిన్న, ఆకుల రంగారావు, రెడ్డి కుమార్, భీమవరపు పాపారావు, తంగేటి మనోహర్, లక్ష్మణ, ఆనంద్, రవి, శ్రీనివాసరావు, మురళి తదితరులు  పాల్గొన్నారు.