సొనాల ప్రాథమిక పాఠశాలలో బోనాల జాతర
చిత్రం న్యూస్, సొనాల:ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని విద్యార్థినిలు, మహిళా ఉపాధ్యాయులు గ్రామదేవతలకు బోనాలు సమర్పించారు. పోతరాజు వేషధారణలో విద్యార్థులు అలరించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పుష్పల విద్యార్థులకు బోనాల విశిష్టతను, ఆషాడ మాసంలో గ్రామ దేవతలని మన ఇంటి ఆడబిడ్డలుగా భావించి బోనంతో పాటు సారెను సమర్పిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్యలక్ష్మి, భారతి, వరలక్ష్మి, పోషకులు తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-

