డొప్టాలలోని శ్రీ రామాలయ పునఃనిర్మాణానికి భూమిపూజ
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని డొప్టాల గ్రామంలో సుమారు 50 లక్షల నిధులతో శ్రీ రామాలయం పునఃనిర్మాణ పనులకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్, మండల అధ్యక్షులు ఇంధ్రశేఖర్, గ్రామ మాజీ సర్పంచ్ రాకేష్, బీజేపి మండల సీనియర్ నాయకులు నిక్కం దత్త, రాము, మోరేశ్వర్, నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
