Chitram news
Newspaper Banner
Date of Publish : 21 July 2025, 11:27 am Editor : Chitram news

జవాను మృతి

   జవాను నలువాల ఆకాశ్

చిత్రం న్యూస్, బోథ్:  ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమన్నూరు గ్రామానికి చెందిన జవాను నలువాల ఆకాష్ (24) సోమవారం మృతిచెందారు. అస్సాం రైఫైల్స్ జీఢీ విభాగంలో జవానుగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. పేద కుటుంబం నుంచి దేశ సేవకు కఠోరమైన శిక్షణను పొంది15 రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే సమయంలో  అనంతలోకాలకు వెళ్ళిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారని గ్రామస్తులు తెలిపారు. చెట్టంత కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తుండడం అక్కడున్నవారందరినీ కలిచివేసింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.