మరిడమ్మ దేవస్థానంలో పూర్వ విద్యార్థుల పులిహోర పంపిణి
చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురంలోని మహారాణి డిగ్రీ కాలేజ్‌కి చెందిన 1988-91 B.Com (B) బ్యాచ్ పూర్వ విద్యార్థులు శ్రీ మరిడమ్మ దేవస్థానంలో భక్తులకు పులిహోర, వాటర్, చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. అమ్మవారి జాతరలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితాల్లో శాంతి, సమృద్ధి, ఆరోగ్యం ఏర్పడాలని ఆకాంక్షించారు. సమాజానికి చిన్నపాటి సేవ చేయగలిగే ఈ అవకాశం మరిదమ్మ అమ్మవారి ద్వారా కలిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాబోలు సత్య ప్రసాద్, పైడా రామకృష్ణ, ఆర్వీ సత్యనారాయణ, ప్రతాప్ సింహా, కశిరెడ్డి శ్రీను, చి.వెంకటేశ్వరరావు, డీవీడీ సత్యనారాయణ, జగ్గారావు, వి.అప్పారావు, వసంతరావు, కర్రి వరలక్ష్మి, కె.సత్యనారాయణ, ఉమా మహేశ్, కామరాజు తదితరులు పాల్గొన్నారు.

