Chitram news
Newspaper Banner
Date of Publish : 20 July 2025, 1:20 pm Editor : Chitram news

బీసీలకు అండగా తెలుగుదేశం పార్టీ

మంత్రి కొలుసు పార్థ సారధిని సన్మానిస్తున నాయకులు
*యాదవులకు చట్ట సభల్లో ప్రముఖ స్థానం కల్పించింది కూటమి ప్రభుత్వం

చిత్రం న్యూస్, నూజివీడు: బీసీలకు అండగా నాడు, నేడు తెలుగుదేశం పార్టీ అండగా ఉందని, యాదవులకు చట్ట సభల్లో ప్రముఖ స్థానం కల్పించింది కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. కృష్ణా జిల్లా పోరంకి, సీతారామ గార్డెన్ లో యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. యాదవ సోదర కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకం అన్నారు. సోదరులంతా ఐక్యతతో ఉండి అటు వ్యాపారంలో ఇటు రాజకీయంగా ఎదగాలని సూచించారు. యాదవులు వ్యాపారానికి గొర్రెల, మేకల పెంపకానికి ప్రభుత్వం సుమారు రూ.1కోటి వరకు సబ్సిడీ రుణాలు అందిస్తుందని, దానికి సంబంధించిన సహాయ, సహకారాలు  ప్రభుత్వం తరపున అందిస్తానన్నారు.యాదవులంతా కలిసి ఉండి చట్ట సభల్లో ప్రముఖ స్థానం సంపాదించి తద్వారా మిగిలిన సోదరులకు చేయూత నివ్వాలని పేర్కొన్నారు. బీసీలు,  యాదవులు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖ అన్నారు.యాదవుల సంక్షేమానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెట్టాయని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.  బ్యాంక్ రుణాలు ఇప్పించడంలో బ్యాంకు వారితో మాట్లాడి త్వరగా అందించే బాధ్యత నాది అని ఎవరికి ఏ అవసరం వచ్చిన నన్ను నేరుగా సంప్రదించాలన్నారు. ఎన్ని ఎకరాలు ఉన్న దాన్ని బట్టి బ్యాంకు వారు సబ్సిడీ రుణాలు ఇచ్చి, తద్వారా పారిశ్రామికవేత్తలుగా. మంచి వ్యాపార వేత్తలుగా ఎదగడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. గొర్రెలు, మేకలు, గేదలు, ఫారంలు నిర్మించడానికి ఎన్నో పథకాలు ఉన్నాయని, బ్యాంకులు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని దాన్ని అంది పుచ్చుకొని ఆర్ధికంగా మన యాదవ సోదరులంతా ఎదగాలన్నారు. దానికి నా వంతు సహాయ,సహకారాలు అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.