సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలోని రామాలయంలో హిందూ ధర్మ జాగరణ మండలి ఆధ్వర్యంలో డిసెంబర్ 2023 శనివారం రోజున ప్రారంభించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతోంది. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు సభ్యులతోపాటు భక్తులు, విద్యార్థులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్నారు. నేటికీ 83 వారాలను పూర్తి చేసుకున్నట్లు సభ్యులు తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం వలన భక్తిశ్రద్ధలు, ఏకాగ్రత, ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, మంచి భావాలు, ధైర్యం ,తేజస్సు మొదలైన గుణాలు పెంపొందుతాయని సభ్యులు పేర్కొన్నారు. ప్రతి వారం భగవద్గీత శ్లోకాల పఠనం కూడ చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు. వంద వారాల పాటు 2025 నవంబర్ వరకు సామూహిక హనుమన్ చాలీసా పారాయణం కొనసాగుతుందని తెలిపారు.

