Chitram news
Newspaper Banner
Date of Publish : 19 July 2025, 11:39 am Editor : Chitram news

మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం

బేడ బుడగ సంఘం కాలనీలో ఉచిత కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ శ్రీ సాయి

చిత్రం న్యూస్, బోథ్:  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయమని బోథ్ ఎస్సై శ్రీ సాయి అన్నారు.  శనివారం సాయినగర్ లోని బుడగ సంఘం కాలనీలో నిర్వహించిన ఉచిత కళ్ళద్దాలు పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలో తమ ఆలోచన తో ముందుకు పోతున్నారన్నారు.  ప్రజలకు ఏమి అవసరమో  ఆలోచిస్తూ.. వైద్య శిబిరంలో  భాగంగా కళ్ళద్దాలు, కంటి ఆపరేషన్ లు ఇలా ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారన్నారు. మాసం అనిల్ కుమార్ మాట్లాడుతూ ..ఇప్పటి వరకు సొసైటీ తరుపున 100 మందికి కంటి ఆపరేషన్లు, 300 అద్దాలు వరకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. భవిషత్యు లో మెగా హెల్త్ క్యాంప్, ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో బేడ బుడగ సంఘం అధ్యక్షుడు ఇర్నల రమేష్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెరుగు భోజన్న, కొట్టాల పోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు కొట్టాల రమేష్ రెడ్డి ,యూత్ సభ్యులు రమేష్, సంతోష్, ఉమేష్, విఠల్, కాలనీవాసులు పాల్గొన్నారు.