Chitram news
Newspaper Banner
Date of Publish : 19 July 2025, 11:15 am Editor : Chitram news

కాంగ్రెస్ నేత ఏలేటి అశ్విన్ రెడ్డి ఉదారత

రిషికకు రూ.3.45 లక్షల విలువ గల వినికిడి యంత్రాన్ని అందజేస్తున్న కాంగ్రెస్ నేత ఏలేటి అశ్విన్ రెడ్డి ఉదారత

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన నవ్వ రిషిక కి కాంగ్రెస్ జిల్లా నేత ఏలేటి అశ్విన్ రెడ్డి రూ.3.45 లక్షల వినికిడి యంత్రాన్ని అందజేసి ఉదారత చాటారు. వినికిడి యంత్రం కావాలని గత కొన్ని రోజుల క్రితం అశ్విన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రిషిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని స్పందించి తప్పకుండ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. శనివారం రూ.3.45 లక్షల విలువైన వినికిడి యంత్రాన్ని నవ్వ రిషికకు అందచేశారు. అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తు లో రిషిక ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగం సాధించాలని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రిషిక తండ్రి రాజు మాట్లాడుతూ.. నా కూతురికి వినికిడి యంత్రం వచ్చేలా కృషి చేసినందుకు అశ్విన్, అనీష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.   ఈ సందర్భంగా అశ్విన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుడాల అనీష్,  నాయకులు ప్రవీణ్, మహేష్, రామ్ లక్ష్మణ్ గౌడ్, భాశెట్టి శివ, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.