వేదంలో ఘనంగా బోనాల జాతర
చిత్రం న్యూస్, బోథ్: మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ బోనాల జాతరలో అమ్మవారిని అలంకరించిన తీరు అందరిని ఆకర్షించింది. ఇంతే కాకుండా పిల్లలు ధరించిన అమ్మవారి, పోతురాజుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్. బోనాల జాతర మన సాంప్రదాయ పండగని అది ఆషాడమాసంలోనే ఎందుకు జరుపుకుంటామనే విషయం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు అమ్మవారి గీతాలను ఆలపించి వాటిపై నృత్యాలను చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ముఖ్యంగా విద్యార్థిని చేసిన అమ్మవారి పూనకం వచ్చినట్టు, భవిష్యవాణి చెప్పినట్టుగా చేసిన నాటకం అందరిని చాలా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
