విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఇచ్చోడ వీడిసి అధ్యక్షుడు నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్ లు అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వీడీసీ సభ్యులతో కలిసి సందర్శించారు. కళాశాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించడం చాలా అభినందనీయమన్నారు. కళాశాల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇతర అవసరమైన వసతుల గురించి ఆరో తీశారు. వీడీసీ కమిటీ సలహా సభ్యులు అబ్దుల్ గఫార్, ఆశన్న, నరేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
