మిస్సింగ్, చోరీ అయిన మొబైల్ ఫోన్లు రికవరి
*బాధితులకు అందజేసిన పోలీసులు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ లలో మొబైల్ మిస్సింగ్, చోరికి గురియిన దాదాపు 150 పైగా ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. బాధితులకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వాటిని పోలీసులు అందచేశారు. పోయినవని అనుకున్న ఫోన్లు మళ్ళీ తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. జీవితంలో ఫోన్ ఒక భాగం అయిపోయింది. ఎటు వెళ్ళాలన్న ఏం చేయాలన్న చేతిలో ఫోన్ ఉండాల్సింది. ప్రతిదీ ఫోన్ లోనే భద్రపర్చుకుంతున్నారు. మొబైల్ పడిపోతే లేదా ఎవరైనా దొంగలిస్తే ఆందోళన చెందాల్సిన పరిస్థితి. అయితే టెన్షన్ పడకుండా వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి సీఈఐఆర్ పోర్టర్ లో ఫిర్యాదు చేస్తే చాలు మీ ఫోన్ ఎక్కడున్నా పోలీసులు వెతికిపట్టుకుంటారు.
