ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీకి వినతిపత్రం అందజేస్తున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కల్తీ కల్లు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో కల్తీ కల్లు విక్రయిస్తున్న కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కల్తీ కల్లు తాగి ఎంతోమంది అనారోగ్య బారినపడటమే కాక.. రహదారి ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని వివరించారు. కల్తీ కల్లు కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సురేందర్ రెడ్డి, ప్రసాద్ చారి, శ్రీకాంత్ రెడ్డి, అతర్వ తదితరులు ఉన్నారు.
