బోథ్ కేజీబీవీలో పోచమ్మ తల్లికి బోనాలు
బోథ్ కేజీబీవీలో పోచమ్మ తల్లికి బోనాలు చిత్రం న్యూస్, బోథ్: ఆషాఢమాసం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ కేజీబీవీలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. విద్యార్థులు అమ్మవారి వేషధారణతో అలరించారు. భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నైవేద్యం సమర్పించి సల్లంగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రాథోడ్ వలిత, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు, ఎమ్మార్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.