కొత్త రేషన్ కార్డుల కోసం ఇబ్బందులు
చిత్రం న్యూస్, జైనథ్ : జైనథ్ మండలంలోని వివిధ గ్రామాలకి చెందిన రేషన్ కార్డు లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ పనిచేయక పోవడంతో చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న కూడా తప్పకుండా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విచారణ ముగిసిన సర్వర్ పనిచేయక పోవడంతో మండలంలోనే దరఖాస్తులు పెండింగ్ లో ఉంటున్నాయి. దరఖాస్తు దారులు రోజూ మండల కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.