Chitram news
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 12:30 pm Editor : Chitram news

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి సామ రూపేష్ రెడ్డి రక్తదానం

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి సామ రూపేష్ రెడ్డి రక్తదానం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని భవాని గూడ గ్రామానికి చెందిన టేకం సంతోష్ అనే యువకుడుకిడ్నీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. బాధితుడిని పరీక్షించిన వైద్యులు రక్తం 6.7 గ్రాం ఉండడంతో వెంటనే ఓ పాజిటివ్ రక్తం అత్యవసరమని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డిని సంప్రదించారు. విషయం తెలుసుకున్న సామ రూపేష్ రెడ్డి యువకుడికి అవసరమైన ఓ పాజిటివ్ రక్తాన్ని అత్యవసర సమయంలో అందజేశాడు. ఈ రక్తం అందించడంతో యువకుడికి వైద్యులు రక్తం ఎక్కించారు. అత్యవసర సమయంలో అందరికీ అందుబాటులో ఉంటూ అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తున్న సామ రూపేష్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఆయన వెంట యువ నాయకుడు మేకల జితేందర్,కుటుంబ సభ్యులు విజయ్ తదితరులు ఉన్నారు.