ఆరోగ్య పాఠశాలలో యోగా కార్యక్రమం
చిత్రం న్యూస్, బోథ్ : మండలంలోని కనుగుట్ట జడ్పీ ఉన్నత పాఠశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగ శిక్షకురాలు మునిగెల యోగిత విద్యార్థులతో సూర్య నమస్కారాలు, యోగాసనాలలో వృక్షాసనం, తాడాసనం, హాలాసనం వేయించారు. యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, మానసిక అలసట ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జె.మహేందర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
