నెరవేరనున్న సొనాల మండల ప్రజల కల
*సొనాల రోడ్డు నిర్మాణానికి రూ.1.80 కోట్లు నిధులు మంజూరు
*ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషితో నేరవేరనున్న కల
చిత్రం న్యూస్, సొనాల : గత కొన్ని సంవత్సరాలుగా సొనాల రోడ్డు (ఇచ్చోడ వైపు వెళ్ళే ప్రధాన రహదారి) ప్రమాదకరంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రమాదాలు జరుగుతున్నా, నడవడానికి కూడా వీలు లేనంత పరిస్థితి ఏర్పడినా, మారుమూల ప్రాంతమైన మన గ్రామాన్ని పట్టించుకునే నాధుడే లేడు అనుకునే తరుణంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషితో, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ చొరవతో సొనాల రోడ్డుకు 1.80 కోట్లు మంజూరుకి సాధ్యమైంది. పట్టు వదలని విక్రమార్కుడిలా, తనపై సొనాల మండల ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి మాజీ ఎంపీపీ రుజువు చేసుకున్నారు.
త్వరలో పనులు ప్రారంభం..
రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వారం రోజుల్లో టెండర్ దాఖలు అయ్యేలా చూడాలని, తొందరలోనే పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, సొనాల మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ లకు సొనాల మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
