బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే
*బేల మండలంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
చిత్రం న్యూస్, బేల: గడిచిన ఎన్నో ఏళ్లుగా బీసీలకు సరైన రిజర్వేషన్ లేక కేవలం ఎన్నికల్లో హామీలిస్తూ వారిని ఓట్ల కోసమే గత ప్రభుత్వాలు వినియోగించుకుంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి, బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ లు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీసీ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ల చిత్రపటానికి బేల మండల బీసీలు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గడచిన పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అధికారంలో ఉంటున్న ఇప్పటివరకు బీసీల రిజర్వేషన్ పై స్పందించలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగానే తాము అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు జనాభాకు అనుకూలంగా 42శాతం రిజర్వేషన్ కల్పించిన సీఎం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో దీనిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే, యువజన కాంగ్రెస్ మండల కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఘనం శ్యాం,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోడే అవినాష్,జైనాథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మడవి చంద్రకాంత్,మాజీ సర్పంచ్ లు సుధాం రెడ్డి,రూప్ రావు,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు శంకర్ బొక్రె,కరీం,గులాబ్,ప్రభాకర్ కృష్ణ రాందాస్,రమేష్ పటేల్,ఠాక్రే గంబీర్,కన్య రాజు,ఈశ్వర్,సోహాన్ తదితరులు పాల్గొన్నారు.


