Chitram news
Newspaper Banner
Date of Publish : 15 July 2025, 9:27 am Editor : Chitram news

బోథ్ ఎస్ఐగా శ్రీ సాయి బాధ్యతలు

బోథ్ ఎస్ఐగా శ్రీ సాయి బాధ్యతలు

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ ఎస్ఐగా శ్రీసాయి బాధ్యతలు చేపట్టారు.  ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ప్రవీణ్ మావలకు బదిలీ అయ్యారు. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీసాయిని మండలంలోని పలువురు వేర్వేరుగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. బోథ్ వీడీసీ అధ్యక్షులు అల్లకొండ పోతన్న, ప్రధాన కార్యదర్శి సాయి గౌడ్, కోశాధికారి రాయిపెళ్లి రమాకాంత్, ఉపాధ్యక్షులు ఎలుక రాజు, మెడిచేల్మ ప్రవీణ్, సయ్యద్, దయాకర్, సలహాదారులు కట్ట భూమేష్,  మాసం అనిల్, బుస లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు, సీపీఐ సీనియర్ నాయకులు బి. గోవర్ధన్, మండల కార్యదర్శి  ఎల్. నరేష్, పట్టణ కార్యదర్శి కార్తీక్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు మున్సిఫ్, నాయకులు నితీష్,  సాయి, బోథ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు  సోలంకి సుభాష్, వైస్ ప్రెసిడెంట్ జమ్మూ, జనరల్ సెక్రటరీ భూమన్న, సెక్రటరీ రహీం, కోశాధికారి భరత్ తదితరులు ఎస్ఐని సన్మానించిన వారిలో ఉన్నారు.