-Advertisement-

విద్యార్థులకు ట్యాబ్స్ అందజేసిన ఎంపీ గోడం నగేష్

విద్యార్థులకు ట్యాబ్స్ అందజేసిన ఎంపీ గోడం నగేష్

చిత్రం న్యూస్, సొనాల: సొనాల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో  సీఎస్ఆర్, ఓఎన్జీసీ కలిసి అదిలాబాద్  ఎంపీ గోడo నగేష్ గారి సమక్షంలో  పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు దాదాపుగా 40 ట్యాబ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు నగేష్  మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా విద్యార్థులకు సోషల్ మీడియా , ఏ ఐ ద్వారా ట్యాబ్లెట్స్ తో పిల్లలకు చదువు నేర్పించడం జరుగుతుంద న్నారు. ప్రైవేట్ పాఠశాలకుదీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా అభివృద్ధి చెందాలని పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు అన్ని రంగాల్లో  ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల సభ్యులు మృత్యుంజయ, అంజని, ప్రధానోపాధ్యాయులు సచిన్, అధ్యాపక బృందం, బీజేపీ రాష్ట్ర నాయకులు. మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

✖ Close హోం
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments