ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, బేల: బేలలోని అశోక్ నగర్ కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే శంకర్ ను కాలనీవాసులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. కాలనీవాసులకు, మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కాలనీలో అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రేసు అమ్రేష్ రెడ్డి, కట్కార్ల స్వామి,ఉషాన్న, కన్నె శ్రీనివాస్ రెడ్డి,రేసు అనిల్ రెడ్డి,పొత్ రాజ్ నవీన్,మాడవార్ హరీష్ రెడ్డి,అగార్కర్ ఆకాష్, కుర్మా సాయి రెడ్డి, గుంజేవార్ నరేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

