ఆదివాసీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం- కంది శ్రీనివాస రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టర్ చౌక్ సమీపంలో ఆదివాసీ భవన నిర్మాణానికి ఆయన డీసీసీబీచైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపూ రావులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.నియోజక వర్గానికి మంజూరైన ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ఈ భవన నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. వీలైనంత త్వరగా భవన నిర్మాణం పూర్తి చేసేలా కృషి చేస్తామన్నారు. నియోజక వర్గ అభివృద్ధికి నిధులిచ్చి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి మంజూరు చేయించడంలో కృషి చేస్తున్న మంత్రి సీతక్క, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రుల సహకారంతో నియోజకవర్గానికి మరిన్నినిధులు తీసుకురావడంలో తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిమ్మ సంతోష్ ,బాలూరి గోవర్ధన్ రెడ్డి, సెడ్మకే ఆనంద రావు, కొడప సోనేరావు, మడావి రాజు,సిడాం రాంకిషన్, చిత్రు పటేల్, గంటూబాయి ,రాజేశ్వర్ ,రఫీఖ్ తదితరులు పాల్గొన్నారు.

