గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటి
చిత్రం న్యూస్, విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను గవర్నర్ కు సీఎం చంద్రబాబు వివరించారు. త్వరలో సీఎం చంద్రబాబు దిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో గవర్నర్ ను కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
