బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం
చిత్రం న్యూస్, బోథ్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి మండలి బీసీలకు 42% విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్డినెన్స్ తీసుకువస్తామని తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ బోథ్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి, మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల హామీ ప్రకారం దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు జనాభా దామాషా ప్రకారం ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశాన్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీలలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని, చట్టసభల్లో బీసీ స్థానాలు పెంచే విధంగా దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి, బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మాజీ ఎంపీటీసీలు చట్ల ఉమేష్, షేక్ రజియా బేగం, నాజర్ అహ్మద్, యాల్ల ఇంద్రారెడ్డి, సుద్ధుల అరుణ్ రెడ్డి, చెట్లపల్లి అనిల్, కసిరే పోతన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహమ్మద్ అబ్రాహార, షేక్ షాకీర్, దయాకర్, భోజన్న, రాజశేఖర్, హసిబ్, మహమ్మద్ అబుద్, రహీముద్దీన్ ,సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బత్తుల రమేష్, తదితరులు పాల్గొన్నారు*
