మాండగడ హెచ్ఎం గా అర్చన బాధ్యతలు
*హెచ్ ఎం ను సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకుడు మల్లారెడ్డి దంపతులు, ఉపాధ్యాయులు
చిత్రం న్యూస్, భోరజ్: మండలంలోని మాండగడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ ఎం గా అర్చన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ హెచ్ ఎం గా విధులు నిర్వహించిన చంద్ర మణిని వేరే పాఠశాలకు సర్దుబాటు చేశారు. కాంగ్రెస్ నాయకుడు మామిడి మల్లారెడ్డి దంపతులు, మాజీ సర్పంచ్ సైపట్ మహేందర్ రావు, మాజీ ఉప సర్పంచ్ రవి యాదవ్, ఉపాధ్యాయులు హెచ్ ఎం అర్చనను సన్మానించారు.