నోట్ బుక్స్, పెన్నులు, బ్యాగులు అందజేసిన విద్యార్థులతో మౌనిష్ రెడ్డి
చిత్రం న్యూస్, భోరజ్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భోరజ్ మండలం కామాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, బ్యాగులను అందజేశారు. గ్రామస్తులు ఐక్యతతో ఉండాలని.. అందరూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుందని పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.అనంతరం కామాయి గ్రామానికి చెందిన అక్షర అనే అమ్మాయికి (వికలాంగురాలికి) వీల్ ఛైర్ అందజేశారు. గ్రామస్తులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రాధానోపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు రాజేందర్, గ్రామస్తులు రాజారెడ్డి, సాగర్ వైద్య, బెజ్జారపు రాజు, రూప్ రావు, ప్రమోద్, సతీష్ తదితరులు ఉన్నారు.