యోగతో మానసిక ప్రశాంతత
చిత్రం న్యూస్, బోథ్ :యోగతో మానసిక ప్రశాంతత లభిస్తుందని యోగ శిక్షకురాలు మునిగెల యోగిత అన్నారు. ఆరోగ్య పాఠశాల రెండో విడత కార్యక్రమంలో భాగంగా బోథ్ మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు సూర్య నమస్కారాలు, వీరభద్రసన్, బట్టర్ ఫ్లై వంటి యోగ ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రాథోడ్ వలిత మాట్లాడుతూ.. నిత్యజీవితంలో యోగ భాగమవ్వాలని ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో యోగాని పెట్టడం శుభపరిణామన్నారు.యోగాతో శారీరకంగానే కాక మానసికంగా కూడా దృఢంగా ఉంటారని మానసిక ప్రశాంతతతో పాటు విద్యార్థుల్లో ఏకాగ్రత, చిత్త శుద్ధి ద్యానం వల్ల పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.