ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్
చిత్రం న్యూస్, సొనాల: మండలంలోని సాకేర గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ళను ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ పరిశీలించారు.. ఈ సందర్భంగా తుల అరుణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లని పెద్దోడితో సమానంగా పేదోడు కూడా ఆత్మగౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసిందని, ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, మాజీ ఎంపీ సోయం బాపూ రావుకు, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, సీనియర్ నాయకులు గాజుల పోతన్న, పీఏసీఎస్ డైరెక్టర్ పోశెట్టి, బీసీ సెల్ అధ్యక్షులు జుంగాల భోజన్న, మాజీ సర్పంచ్ వినోద్, రామ్ చందర్, కాకాజీ , హరి సింగ్, బలిరాం, సుధీర్, గంగాధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.