ఘనంగా వేదంలో గురు పూజోత్సవ వేడుకలు
చిత్రం న్యూస్, బోథ్: వేదం పాఠశాలలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు కుమ్మరి పోశెట్టి, ,సురేష్ వైద్య, విచ్చేసి వారు విద్యార్థులకు గురుపూజోత్సవం విశిష్టతను తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అతిథులను పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సన్మానించారు. గురుపూజోత్సవం గురించి ఉపన్యసించారు. శిష్యునిలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు నింపే వాడే నిజమైన గురువు అని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు అసలైన గురువన్నారు. త్రిమూర్త సమానుడైన గురువుకు హైందవ సంస్కృతిలో పర పరమోన్నత స్థానం ఉందని, విద్యార్థులతో పాటు భాషకు జ్ఞానపిపాసి గావించి వెలుగులు ప్రసాదింపజేసి లౌకిక జ్ఞాన సంపన్నులను చేసే సద్గురువు లను ఆరాధించడమే అసలైన గురుపూజోత్సవ ఉద్దేశమని వివరించారు. విద్యార్థులు గురు యొక్క గొప్పతనం గురించి విశిష్టతను గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. గురువు గొప్పతనాన్ని చాటుతూ పద్యాలు కూడా పాడారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.