బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి
*జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి
చిత్రం న్యూస్, బోథ్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఈ ప్రాంత ప్రజల చిరాకాల ఆకాంక్ష నెరవేర్చాలని బోథ్ నియోజకవర్గం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో పూర్తి వివరాలు తీసుకొని, ముఖ్యమంత్రికి తెలియజేస్తానని, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, మెరుగు దాసు తదితరులు పాల్గొన్నారు.