ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని స్థానిక శ్రీరామ ఆలయ కమ్యూనిటీ హాల్లో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం యువకులు, వయోజనులు కలిసి దాదాపుగా 20మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరీ వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏబీవీపీలో పనిచేసిన వారు మంత్రులుగా, సీఎంగా, కేంద్ర మంత్రులుగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. జాతీయ పునర్నిర్మాణం కోసం విద్యార్ధి పరిషత్ పని చేస్తుందని అన్నారు. నేటి యువత వివేకానంద ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం అలుపెరుగని ఉద్యమాలు, అంతులేని పోరాటాలు చేస్తూ విద్యార్థులకు, సమాజానికి ఏబీవీపీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్లు నిఖిల్, మహేష్,మాడవార్ హరీష్ రెడ్డి,నాయకులు మనోజ్ రెడ్డి,నార్లవార్ అజయ్, తరుణ్,కుర్మా పవన్ రెడ్డి,సాయి రెడ్డి, రిమ్స్ వైద్య బృం దం, ఆయా పార్టీ నాయకులు పోత్ రాజ్ నవీన్, బర్కాడే రాము, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.