పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి అందజేత
పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి అందజేత *సమనుజ్ఞ ట్రస్ట్ ఛైర్మన్ కుర్మే విశ్వనాథ్ ఉదారత చిత్రం న్యూస్, తలమడుగు: తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సమనుజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు చైర్మన్, న్యాయవాది కే.విశ్వనాథ్ పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసి ఉదారత చాటారు. గురువారం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్టు వైస్ ఛైర్మన్ సోని, ఆదిలాబాద్ మండల మాజీ ఎంపీపీ...