Chitram news
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 1:28 pm Editor : Chitram news

పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి అందజేత

పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి అందజేత 

*సమనుజ్ఞ ట్రస్ట్ ఛైర్మన్ కుర్మే విశ్వనాథ్ ఉదారత

చిత్రం న్యూస్, తలమడుగు: తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సమనుజ్ఞ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు చైర్మన్, న్యాయవాది కే.విశ్వనాథ్ పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసి ఉదారత చాటారు. గురువారం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్టు వైస్  ఛైర్మన్ సోని,  ఆదిలాబాద్ మండల మాజీ ఎంపీపీ బాయిన్ వార్ గంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు మామిడి లక్ష్మణ్,  కతులాపూర్ శ్రీనివాస, మాజీ సర్పంచ్ ముల్కల రాజేశ్వర్, గ్రామ పెద్ద ఎడ్ల ఆశన్న, ఎడ్ల చిన్న ఆశన్న, యూత్ ప్రెసిడెంట్ సారంగుల రవి, దువాస భగవాన్లు, దొనపెల్లి రాజు, హెచ్ఎం. శ్రీనివాస్, టీచర్ కల్పన, విద్యార్థులు. ఉపాధ్యాయులు, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది, ట్రస్ట్ చైర్మన్ కుర్మే విశ్వనాథ్ మాట్లాడుతూ..ఆదిలాబాద్ జిల్లా లోని అట్టడుగు పేద విద్యార్థులకు మా ట్రస్ట్ తరపున ఉన్నత చదువుల కోసం భవిష్యత్తులో  అనేక సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.