Chitram news
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 10:02 am Editor : Chitram news

కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న  ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ తుల అరుణ్

చిత్రం న్యూస్, సొనాల:  సొనాల మండలంలోని చింతల్ బోరి గ్రామంలోని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర విచార్ విభాగ్ కోఆర్డినేటర్ తుల అరుణ్  వీరికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చింతల్ బోరి గ్రామ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ  పథకాలను అమలు చేస్తోందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదవారందరికీ రేషన్ కార్డులు అందిస్తుందని, అదేవిధంగా సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు, రాజీవ్ యువ వికాసం ఎన్నో పథకాలు ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ ముండే, గాజుల పోతన్న, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, పీఏసీఎస్ డైరెక్టర్ పోశెట్టి, ఆత్మ డైరెక్టర్ ముండే శ్రీధర్, సొనాల గ్రామ పట్టణ అధ్యక్షులు అనిల్, బీసీ సెల్ చైర్మన్ భోజన్న, శ్రీరామ్ గైక్వాడ్, సంతోష్ ధన్వే, దేవిదాస్, గంగారామ్ తన్వే, జాదవ్ సదానంద్, కోరుట్ల వినోద్, మారుతి, జాదా మోహన్, ధన్వే దొండిబా తదితరులు పాల్గొన్నారు.