Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

మాజీ ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి  సందర్భంగా పండ్లు పంపిణీ

మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి  సందర్భంగా పండ్లు పంపిణీ

చిత్రం న్యూస్, బోథ్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ వీరాభిమాని అల్లం మనోహర్ సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవీన్ రెడ్డి, స్టాఫ్ ఆధ్వర్యంలో  రోగులకు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి  పేదవాడికి అనేక పథకాలు లబ్ది చేకూరాయని ,  గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు.  అలాంటి వ్యక్తిని మర్చిపోకూడదని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ రెడ్డి,అల్లం మనోహర్, లక్ష్మణ్ యశోద,లింగారెడ్డి, రేణుక, అనసూయ, జమున  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments