కుల సంఘాల భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
కుల సంఘాల భవన నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పది కుల సంఘ భవనాలకు రూ.50 లక్షల నిధులు కేటాయించారు. ప్రజాసేవ భవన్ లో ప్రొసీడింగ్ పత్రాలను సోమవారం వివిధ కుల సంఘాలకు అందజేశారు .కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..గత ప్రభుత్వం కుల సంఘాలను ,చేతి వృత్తులను విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే చేతి వృత్తులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు.
