ఇసుక ట్రాక్టర్ పట్టివేత
చిత్రం న్యూస్, చిగురుమామిడి: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను సోమవారం పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కృష్ణ తెలిపారు. వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ని పట్టుకున్నామన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
